అనుష్కశెట్టి ఇన్ స్టా ఫోటో వైరల్.. మళ్లీ ఫామ్‌లోకి దేవసేన

సెల్వి

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (12:17 IST)
సోషల్ మీడియాను చాలా అరుదుగా ఉపయోగించే బాహుబలి దేవసేన అనుష్క శెట్టి బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అనుష్క శెట్టి తన పెంపుడు శునకంతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అనుష్క శెట్టి ప్రస్తుతం తెలుగు, మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె దర్శకుడు క్రిష్ గాతిలో నటించింది. గాతీ అనేది  ప్రతీకారంతో కూడిన కథ. ఇందులో లేడి ఓరియెంటెడ్ పాత్రలో ఆమె కనిపిస్తోంది. 
 
అలాగే మలయాళ సినిమాలోనూ అనుష్క నటిస్తోంది. ఒరిస్సా నేపథ్యంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవల ఒరిస్సాలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు