"సైరా"లో క్యామియో పాత్రలో అనుష్క?

గురువారం, 16 మే 2019 (15:31 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. మొన్నటి అగ్ని ప్రమాదంలో సెట్ కాలిపోకపోయి ఉంటే ఇంకాస్త వేగంగా ముగింపు దశకు వచ్చేది. ఇప్పుడు కొంత ఆలస్యం తప్పేట్లు లేదు. దసరాకు వస్తుందన్న క్లారిటీ మిస్ అవుతోంది. టీమ్ కూడా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.
 
ఇదిలావుండగా,  అనుష్క సైరాలో కీలకమైన క్యామియో ఒకటి చేస్తోందని వారం రోజుల క్రితమే టాక్ వచ్చింది. దీన్ని ఎవరూ నిర్ధారించలేదు కానీ వార్త మాత్రం కాస్త బలంగా ఫిలిం నగర్ ప్రచారంలో నలిగింది. ఇప్పుడు వచ్చిన మరో అప్‌డేట్ సస్పెన్స్‌ని తగ్గించింది. ఇందులో అనుష్క సైరా నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్యూరేటర్‌గా కనిపించబోతోందట. 
 
అంటే సినిమా కథలో భాగంగా కనిపించదు కానీ ఆ స్టోరీని మనకు చెప్పే యాంకర్ లాంటి రోల్ చేస్తుందన్నమాట. ఈ ప్రకారం చిరుతో అనుష్క కాంబినేషన్ సీన్లు లేనట్టే. దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినా నిజమే అని సమాచారం. ఈ విషయంలో రాంచరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని అనుష్క‌ను ఒప్పించినట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు