యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

ఠాగూర్

సోమవారం, 4 ఆగస్టు 2025 (08:51 IST)
యెమెన్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అక్రమ వలసదారులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతయ్యారు. ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మొత్తం 154 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో కొట్టుకునిపోగా, 68 మంది జలసమాధి అయ్యారు. 
 
54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. మరికొన్ని శవాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. ఆ శాలను మార్చురీకి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో  గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళుతుంటారు. స్మగ్లర్లు వారిని పడవల ద్వారా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు