బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కు కరోనా

ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (15:43 IST)
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్ధారించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చిందని తెలిపారు. 
 
అయితే, ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని తెలిపారు. వైద్యులు, డాక్ట‌ర్లు, అధికారుల సూచ‌న మేర‌కు ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని తెలిపారు. మీ మ‌ద్ద‌తు కోసం ముందుగానే కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. 
 
రాబోయే రోజుల్లో త‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉందని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు