భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

డీవీ

సోమవారం, 20 జనవరి 2025 (20:45 IST)
Athdhi dance with bellamkond
నటి అతిథి శంకర్ సింగర్ మంచి డాన్సర్ కూడా.  'భైరవం' విజువల్ స్టన్నింగ్ టీజర్ లాంచ్ లో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆడి పాడింది కూడా. ఇది సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఎ.ఎ.ఎ. థియేటర్ లో జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ సినిమా అంతా సీరియస్ కు సీరియస్ గా జోవియల్ కు జోవియల్ పనిచేశామని హీరోలు తెలియజేశారు.

విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్ పై నిర్మించారు. పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పకులుగా వ్యవహరించారు. ఇందులో  ఆనంది, దివ్య పిళ్లై  హీరోయిన్స్ గా నటించారు.
 
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నాం. అలా భైరవం లాంటి మంచి కథ దొరికింది. ఈ సినిమాని రోహిత్ మనోజ్ తప్పితే ఎవరు చేయలేరనే అంతా గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సినిమా చేసాం. అతిధి, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు. సినిమాని ప్రేమించే మీ అందరికీ థాంక్యూ వెరీ మచ్. ఇది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది' అన్నారు.
 
హీరో మనోజ్ మంచు మాట్లాడుతూ.. రోహిత్ బాబాయ్ నాకు చిన్నప్పటినుంచి క్లోజ్. ఈ సినిమాతో ఇంకా క్లోజ్ అయిపోయాం. ఒక్కడు మిగిలాడు సినిమా 2016లో చేసినప్పుడు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో అది నా లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ భైరవం టైటిల్ తో రోహిత్ తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. తను అద్భుతంగా పెర్ఫాం చేశారు. తనతో కలిసి స్టెప్స్ వేయడం చాలా ఆనందంగా ఉంది. అతిథి సింగర్, మంచి డాన్సర్. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను' అన్నారు.
 
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, సెట్స్ లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు మోస్ట్  మెమొరబుల్ ఫిలిం. ఈ సినిమా విజయం సాధించి విజయ్ మరెన్నో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ టీజర్ నచ్చడం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. థియేటర్స్ లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ...ఈ సినిమా మాస్ యాక్షన్ ఆడియన్స్ కి పండగలా ఉంటుంది. మనోజ్ అన్నతో పని చేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఆయన్ని చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఇప్పటివరకు సాయి గారు చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి గారు ఒక రేంజ్ లో ఉంటారు. నన్ను కూడా ఒక మెట్టు పైకి తీసుకువెళ్తారు. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతి 'అన్నారు.
 
హీరోయిన్ అతిధి శంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్' అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు