Aditi Shankar, sai srinivas
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ 'భైరవం' ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీని పెంచాయి. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ లాంచ్ చేశారు.