పొగిడేవారిని దూరంగా పెట్టండి : సి. కళ్యాణ్‌ పిలుపు

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (17:09 IST)
C. Kalyan, Vallabhaneni Anil Kumar, and komram children
సినీరంగంలో జూనియర్‌ ఆర్టిస్టు నుంచి చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగానే కాకుండా, ఫెడరేషన్‌ అధ్యక్షునిగా 2016వరకు కొనసాగిన కొమరం వెంకటేష్‌ జీవితం అర్థంతరంగా ముగియడం విచారకరమని వక్తలు పేర్కొన్నారు. 15వరోజైన శుక్రవారంనాడు ఆయన సంతాప సభ హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో జరిగింది. కాలనీవాసులతోపాటు ఇతర రంగాలకు చెందిన వారూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ, సినిమారంగంలో పొగిడేవాళ్ళు ఎక్కువగా వుంటారు. వారి వల్లే జీవితాలు నాశనం అవుతాయి. 
 
komaram santapasabha
2015వరకు అందరితో బాగానేవున్న కొమరం వెంకటేష్‌ కొంతమంది పక్కన చేరి నువ్వు ఇంద్రుడువి, చంద్రుడివి అంటూ తప్పు దోవ పట్టించారు. వారివల్ల జీవితం కోల్పోతానని అప్పుడు ఊహించి వుండడు. పక్కవారు ఇచ్చిన సలహా మేరకు రెండు సినిమాలు నిర్మించారు. పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఆయన్నుంచి చాలామంది లబ్ది పొందారు. దయచేసి వారిని ఇదే వేదికపై కోరోదొక్కటే మీకు ఏదైనా డబ్బురూపంలో ఆయన ఆర్థిక సాయం చేస్తే, అందులో సగమైనా వారి కుటుంబానికి అందజేయండి. ఇప్పుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు స్వంత ఇల్లులేకుండా వున్నారు. కోట్లు సంపాదించినా ఇంట్లో భార్యకు కూడా కనీసం చెప్పలేకపోయాడు.
 
కోటి ;రూపాయలతో  కారుకొన్నా అదిఏమయిందో ఇంటిలోవారికి తెలీదు. అదేవిధంగా బాలకృష్ణగారికి కొంత డబ్బు ఇచ్చారు. ఆయన్ను అడిగి నేను వారి కుటుంబానికి ఇప్పిస్తాను. అదేవిధంగా రమేష్‌ అనే నిర్మాతకు 2.5 కోట్లు ఇచ్చాడు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇంకోవైపు ఎం.పి. టికెట్‌ కోసం ఓ రాజకీయ పార్టీకి చెందిన వారికి 5 కోట్లు ఇచ్చాడని తెలిసింది. ఇలా ఎందరో ఆయన్నుంచి లబ్దిపొందినవారు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోండి అని అన్నారు.
 
ఈ సందర్భంగా ప్రస్తుతం చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు, ఫెడరేషన్‌ అధ్యక్షుడు అయిన వల్లభనేని అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ, వెంకటేష్‌తో నాకు ఎప్పుడూ శత్రుత్వంలేదు. 2015వరకు ఆయన మాతో బాగానే వుండేవాడు. 2016 తర్వాత కొత్త కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. కనీసం సొంత ఇల్లుకూడా లేకుండా చనిపోయారంటే నాకే చాలా బాధేసింది. వారి పిల్లల చదువు బాధ్యత  మా చిత్రపురి కమిటీ చూసుకునేట్లుగా మాట్లాడుకున్నాం. దయచేసి ముందుముందు ఎవరైనా సరే మనం ఏం చేస్తున్నామో ఆస్తులు ఎన్ని వున్నాయో కనీసం భార్యకైనా చెప్పండి. 
 
కొమరం గారు ఆసుపత్రిలో వుంటే చనిపోయే ముందు వారి అమ్మాయికి కొందరి పేర్లు చెప్పి వీరు మనకు డబ్బులు ఇవ్వాలి అన్నారట. వారి అమ్మాయికే ఎందుకు చెప్పాడో అర్థంకాలేదు. ఆ పేర్లు ఆమెకు తెలీయవు. ఆ తర్వాత నాకు చెప్పింది. తను చనిపోతాడని ముందే తెలిసి వారిబిడ్డకు చెప్పారనుకుంటున్నా. దయచేసి ఎవరైనా ఆయనకు డబ్బులు ఇవ్వాల్సినవారు తిరిగి ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. నా వంతు బాధ్యతగా వారి కుటుంబానికి అన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి