పైగా, ఈ సినిమా చూసి యూత్ చెడిపోరా అని అడిగితే అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ సినిమాలో కౌంటెంత అని అడిగితే 100 అని చెబుతాను... అలా అని నిజ జీవితంతో వంద మందితో తిరిగినట్లు కాదు కదా అని కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లో హీరో 50 మందిని హత్య చేస్తాడు. అలా నిజ జీవితంలో జరగదు కదా అని ప్రశ్నిస్తాడు.
సినిమాను ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే భావించాలని, నిజ జీవితాలకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ సినిమాలో మసాలా సీన్లు ఉన్న మాట వాస్తవమేనని... అయినా అలాంటి సీన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. రియల్ లైఫ్‌లో చేస్తున్నదే కదా అని అవసరాల శ్రీనివాస్ ఘాటుగా రియాక్టయ్యాడు.