రూ.వెయ్యి కోట్లు అంటే తెలియని నిర్మాతను తానని, ఈ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అయితే, తమ చిత్రం విజయం సాధించడం చూసి అసూయ పడుతున్న కొందరు కావాలని చెప్పే, తాము ఆర్మీకి డబ్బు డొనేట్ చేస్తున్నామనే వదంతులు సృష్టిస్తున్నారన్నారు. ఆర్మీకి ‘బాహుబలి’ టీమ్ ఎలాంటి డొనేషన్స్ చేయడం లేదని శోభు స్పష్టం చేశారు.
మరోవైపు... 'బాహుబలి-2 : ద కన్ క్లూజన్' దెబ్బకి రికార్డులన్నీ తెల్లబోయాయి. ఇంతవరకు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కిన 'దంగల్' సాధించిన వసూళ్లను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. 'దంగల్' హిందీలో 387.39 కోట్ల రూపాయలు వసూలు చేసి, దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.
ఈ రికార్డును బాహుబలి బ్రేక్ చేసింది. ఇప్పటివరకు 392 కోట్ల రూపాయల వసూళ్లతో 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' నిలిచింది. ఇప్పటికే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.