ప్రభాస్ "ఆదిపురుష్" మూవీ విడుదల తేది ఫిక్స్!!

గురువారం, 19 నవంబరు 2020 (10:28 IST)
ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ఆదిపురుష్. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. 
 
ఈ ప్రకటన మేరకు.. ఆదిపురుష్ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో మరోసారి 'ఆదిపురుష్' ట్యాగ్ వైరల్ అవుతోంది. 
 
ఈ చిత్రం మరోసారి భారత సినీ ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి చాటుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం చిత్రం విజయవంతం కావాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు