విజయవాడ: బాహుబలి 2 సినిమాలో 9 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తస్కరించిన గ్రాఫిక్స్ డిజైనర్ కృష్ణ అరెస్ట్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి 2 గ్రాఫిక్స్ ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణ ఈ చిత్రంలో కొంత భాగాన్ని తన పెన్ డ్రైవ్‌లో ఎక్కించుకుని తస్కరించాడు. దీనిపై చిత్ర నిర్మాతలు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, లీక్ కావడం పరిశ్రమకు షాక్ కలిగించింది. అనుష్క, ప్రభాస్‌లపై చిత్రీకరించిన వార్ సీక్వెన్స్ నెట్లో ప్రత్యక్షం అయింది. దీనిని సీరియస్‌గా తీసుకున్ననిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.