బాలయ్య పుట్టినరోజు.. షార్ట్ బయోగ్రఫీ.. నో సైడ్ రోల్స్, నో విలన్, నో గెస్ట్, ఓన్లీ హీరో పాత్రలే

శుక్రవారం, 10 జూన్ 2022 (14:48 IST)
బాలయ్య బాబు పుట్టిన రోజు నేడు. ఈ రోజున బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరెన్నో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్‌లలో స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం కూడా బాలయ్య ఫ్యాన్స్‌కు ఖుషీ తెప్పించింది. 
 
బాలయ్య నందమూరి హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఎంటర్టైన్మెంట్ లేకుండా తక్కువ టికెట్ రేట్లతో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
 
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో కళ్లు చెదిరే స్థాయిలో వ్యూస్‌ను సాధిస్తోంది. 
 
అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 
 
యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లకు బాలయ్య ఛాన్స్ ఇస్తున్నారు. బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
బాలయ్య షార్ట్ బయోగ్రఫీ
48 ఏళ్ల పాటు నటనకు నో బ్రేక్ 
1974-2021 వరకు (ప్రతీ ఏడాదీ సినిమా)
106 సినిమాలు (ఓన్లీ హీరో పాత్రలే, నో సైడ్ రోల్స్, నో విలన్, నో గెస్ట్)
126 హీరోయిన్లతో జతకట్టిన హీరోగా రికార్డు 
రూ.10 లక్షల నుంచి రూ.200 కోట్ల వరకు కలెక్షన్లు 
10 అడుగుల నుంచి 108 అడుగుల వరకు కటౌట్లతో రికార్డ్స్ 
100 రోజుల నుంచి 1000 రోజుల వరకు షోలతో రికార్డ్ 
ఆరు జనరేషన్స్ గడిచినా హీరోగా అదుర్స్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు