boyapati- balayya- ravindra
నందమూరిబాలకృష్ణ `అఖండ` విజయం తర్వాత దేవాలయాలను దర్శించుకున్నారు. గురువారం ఉదయం 6గంటలకు సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో స్వామివారిని దర్శించి తరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “అఖండ” సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. ఈ ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాతో చలన చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు.