నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా అనేకన్నా... బాలకృష్ణతో బాంతాట ఆడుకుంటున్న క్రిష్ అనొచ్చేమో! ఎందుకంటే, దర్శకత్వాన్ని పిచ్చిగా ప్రేమించే క్రిష్... బాలయ్యను రఫ్ ఆడించేస్తున్నాడట. ఆయన నుంచి నటన మొత్తం పిండేస్తున్నాడట. సాధారణంగా బాలయ్య చిత్రం అంటే, ఎక్కువగా గ్రాఫిక్స్, వైర్ వర్క్ మీద నడిపిస్తుంటారు. ఆయన వేసే స్టెప్పులు కూడా మోషన్ స్పీడ్ చేసి మిక్స్ చేస్తుంటారు. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.
కానీ, బాలయ్య 100వ చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి'లో మాత్రం దీనికి రివర్స్‌లో నడుస్తోందట. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం చాలా స్ట్రిక్ట్‌గా సాగుతోందట. ఉదయం ఫలానా టైమ్ అంటే... ఇక కెమేరా ఫిక్సే... బాలయ్య కెమేరా ముందుకు రావాల్సిందే... చెప్పింది చెప్పినట్లు చేయాల్సిందే... గ్రాఫిక్స్... గ్రీఫిక్స్ జాన్తా నై... అంటున్నాడట క్రిష్.
తాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, బాలయ్య నుంచి నటనను వెలికితీస్తున్న క్రిష్‌ను చూసి నట సింహమే నివ్వెరపోతోందట. బాబోయ్ ఇంత పని రాక్షసుడేంటి... నా పని అయిపోతోంది బాబూ అంటూ బాలయ్య లబోదిబో మంటున్నాడట. వెంట పర్సనల్ డాక్టర్‌ని పెట్టుకుని మరీ బాలయ్య షూటింగ్‌లో పాల్గొంటున్నాడంటే... క్రిష్ ఆయనలోని నటనను ఎంతగా వెలికితీస్తున్నాడో అర్ధం అవుతుంది. మరి ఇక బాలయ్య ఇంత కష్టపడిన తర్వాత గౌతమీ పుత్ర శాతకర్ణి ఇక హిట్ కాకుండా ఉంటుందా? బాలయ్య సినీ జీవితంలో కలికితురాయి కాకపోతుందా? సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.