బాలయ్య ప్లేస్‌లో వెంకీ కాదు రవితేజ

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:18 IST)
మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ - దగ్గుబాటి రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ రావడం ఖాయం అనుకున్నారు. 
 
అయితే.. బాలయ్య ఈ రీమేక్ విషయంలో అంతగా ఆసక్తి చూపించకపోవడంతో వేరే హీరోను చూస్తున్నారని మరో వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య ప్లేస్‌లో వెంకీ రానున్నాని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే.. సురేష్‌ బాబు వెంకీ - రానా కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ కాలేదు. అయితే.. ఈ కథతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తారనుకున్నారు. 
 
కానీ.. వెంకీకి ఈ సినిమా సెట్ కాదనే ఉద్దేశ్యంతో వెంకీ కాకుండా మరో హీరో కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని తెలిసింది. ఈ కథ విని రవితేజ ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాని సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నారని.. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు