టాలీవుడ్ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ పట్ల కరోనా వైరస్ ప్రేమ ఎక్కువైనట్టు తెలుస్తుంది. దీంతో ఆయనకు మరోమారు ఈ వైరస్ సోకింది. తొలిదశ సమయంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. అపుడు హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేసి చికిత్స తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఇపుడు ఆయన మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండగా, ఆదివారం సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు వెల్లడించారు. అయితే, ఢిల్లీలో ఆయన ఒక్కరే ఉన్నారు. అయినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ ఫలితం వచ్చినట్టు ఆయన వెల్లడించారు.