బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.