ఆదివారంనాడు మేకర్స్ 'ప్రేమంటే' అనే టైటిల్‌ను విడుదల చేశారు, రెండు టీ కప్పులు టెర్రస్‌పై వుంచి, ప్రశాంతమైన నగర రాత్రి వాతావరణాన్ని కలిగి ఉన్న ఎట్రాక్టివ్ పోస్టర్‌ను విడుదల చేశారు, "థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ చూస్తోంది.
అలాగే పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. రానా క్లాప్ ఇవ్వగా, సందీప్ రెడ్డి వంగా ముహూర్తపు షాట్ కోసం కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు, జనార్దన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
సునీల్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో జాన్వి నారంగ్ కంటెంట్-బేస్డ్ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆమె మొదటి ప్రాజెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక ఉత్తేజకరమైన ఎంటర్టైనర్. ఇండస్ట్రీ పవర్‌హౌస్ రానా దగ్గుబాటి సపోర్ట్ పొందడం ఆమెకు లక్, అతని నిర్మాణ అనుభవం, అసాధారణమైన స్క్రిప్ట్ చాయిస్ ఈ చిత్రానికి గొప్ప వాల్యూని జోడిస్తున్నాయి.. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.