నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించారు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈమెకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో అవకాశాలు ప్రస్తుతం భారీగా వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని తన క్రేజ్ పెంచుకున్నారు నిధి అగర్వాల్. మరోవైపు తమిళంలోనూ ఈమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే 2021లో జయం రవితో భూమి.. శింబుతో ఈశ్వరన్ సినిమాలలో నటించారు నిధి అగర్వాల్. ఈ రెండు సినిమాలతో తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిధి అగర్వాల్.