Sanvi, BARaju, Achi reddy, Adi
ఆదిసాయికుమార్, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం`లవ్‌లీ`. లవ్అండ్‌మ్యూజికల్ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేనర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ అందరి కెరీర్‌లో ఒక మొమరబుల్ మూవీగా నిలిచింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని అన్ని పాటలు ఇప్పటికీ మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ `విజయ్ మేరీహై`కి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా `విజయ్ మేరీహై` సినిమా 50మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది.