ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ "తాను ఇంతవరకు కలలో కూడా హైదరాబాద్ టైమ్స్ డిజైరబుల్ ఉమెన్ గా విన్నర్ అవుతానని ఊహించలేదు. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నానని తన సంతోషాన్ని వ్యక్తంచేసింది. అలాగే "మిమ్మల్ని దేని గురించి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రేక్షకులు ఎంచుకున్నారని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు, నా అందం కంటే ఎక్కువగా జనాలు నా క్యారెక్టర్ ఇష్టపడతారు. నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అని భావించారని నేను అనుకుంటున్నాను. అందం కాలంతో పాటు మారిపోతుంది. కానీ తెలివి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ మరింత తెలివిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను అని సమాధానం చెప్పింది.