తాజాగా ఈ సినిమాలోని చరణ్ పాత్రపై దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. రామ్‌చరణ్ సిద్ధ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిస్తాడు. పాత్ర నిడివి అరగంట వుంటుంది. అయినా ప్రాధాన్యత వుంటుంది. కీలక సన్నివేశాలకు చరణ్ పాత్ర ముడిపడి వుంది. సినిమా ద్వితీయార్థంలో చరణ్ పాత్ర కనిపిస్తూనే వుంటుంది. అయితే ఇందులో వారిద్దరు తండ్రీ కొడుకులుగా నటించలేదు. అంతకుమించిన అనుబంధం అంటూ వివరించారు. చరణ్ పక్కన పూజా హెగ్డే నటిస్తుంది. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్ కంపెనీ, మేట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.