ఈ ఫైనల్స్‌లో వాసి టోనీ (యశ్వంత్ మాస్టర్ టీమ్), సంకేత్ సహదేవ్ (యశ్వంత్ మాస్టర్ టీమ్), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్ బృందం), జియా ఠాకూర్ (అనీ మాస్టర్ బృందం), డార్జిలింగ్ డెవిల్స్ (రఘు మాస్టర్ బృందం) పోటీపడ్డారు. శాస్త్రీయ నృత్యానికి పాశ్చాత్య నృత్య రీతులను కూడా మిళితం చేసి మహేశ్వరి–తేజస్విని ఆకట్టుకుంటే, తమదైన వైవిధ్యతను చూపుతూ మిగిలిన పోటీదారులు ఆకట్టుకున్నారు.