భగవద్గీత, ద ప్రాఫిట్ నచ్చిన పుస్తకాలుః సిరివెన్నెల
శనివారం, 5 జూన్ 2021 (21:05 IST)
trivikram, Sitaramashastri
ట్విట్టరు ప్రపంచంలోకి అడుగు పెట్టి సంవత్సరం దాటిన సందర్భంగా ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సాహిత్యం, సినిమాలు, ఆద్యాత్మికం, వ్యక్తిగతం వంటి పలు విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చాయి. అన్నింటికి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆ విశేషాలు.
- కథా యజ్ఞానికి ప్రధాన ఋత్విజుడు కాళీపట్నం రామారావు మాస్టారు. జీవితం అంతటినీ కథ అనే సాహితీ ప్రక్రియకు అంకితం చేసిన మహా వ్యక్తి. కథని పదికాలాల పాటు పచ్చగా ఉంచడానికి పెంచడానికి తన యాగఫలాన్ని ధారపోసి వెళ్లారు.
* ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్నిరకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం.
* మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.
* "ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా"
అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్ర బిందువు
* పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు.
* లిస్టు చాలా పెద్దది, "పిట్టభాష" సరిపోదు.
ఇక - కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.
* వాల్మీకి
* "ప్రశ్న - కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న"
* ..తనను తాను నిర్వచించుకోగలగాలి
* ప్రతీ పాట
* నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండు - ఖలీల్ జిబ్రాన్ రాసిన "ద ప్రాఫిట్"
* చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. "నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే" అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.
* ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను
* మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!
* నేను ప్రజలకు ఫలానా పుస్తకం చదవమని ఎప్పుడూ చెప్పలేదు. అది జీవితాన్ని తీవ్రమైన అక్కరతో బ్రతకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏది చదవాలో, ఎప్పుడు ఏది కావాలో జీవితమే తెచ్చి ఇస్తుంది.
* అత్యంత తీవ్రతతో ప్రతీ క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం - అదే నా ప్రేరణ.
* తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు.
* నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం.
* ఒక వ్యక్తి ఉండరు, వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గొప్పగానే చేస్తారు. ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాదు, ఏ ప్రతిభా వ్యక్తీకరణకైనా ఇదే వర్తిస్తుంది.
* ఆమాట అన్నది అమృతం సీరియల్ రూపకర్త గుణ్ణం గంగరాజు.
మీ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే - "భవసాగరాన్ని ఒక చెంచాడే అనుకోగలగడం"
* తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం
* దర్శకుడు నాకు భిన్నంగా ఉన్నాడని అని అనుకోకపోవడం. అతని భావాలను, ఆలోచనలు నావిగా చేసుకుని చెప్పాలనే ప్రయత్నం చేయడం. కాస్త ఇటుఅటు అయినా ప్రతీ ఒక్కరూ మనిషే, ప్రతీ భావమూ మనిషి భావమే.
* సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలు అనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి.
ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే.
* మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా "తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు" -
వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది.
* దృశ్యంలో లేదు, చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది.
* చాలా! ప్రతీ ఒక్కరూ ఏదోక గొప్ప పాట రాసే ఉంటారు.
* నేనున్నాను గనుక!
* "సరిగా చూస్తున్నదా నీ మది...
గదిలో నువ్వే కదా ఉన్నది...
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది"
"చూపులను అలా తొక్కుకు వెళ్ళకు" అని మీకూ తెలుసు, ఎవరినో ఎందుకు నిందించడం!
* నా బుర్రలో అలజడి!
* తప్పే! మృగాలను అవమానించకూడదు.
* బ్రతుకంతా ప్రేమే! ప్రేమ నుండే ప్రేమ వస్తుంది!
* కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉధృతిని మోతాదు మించనివ్వం.
"నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా"
* యూత్ అనేది ఏజ్ కాదు. అదొక ఫేజ్. అదొక స్టేజ్. అది తెలుసుకుంటే - Youth itself is a message.
* అలాంటి భావాలున్నటువంటి మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు?
* జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.
* ఏ భాష ప్రత్యేకత ఆ భాషదే! అసలు సమస్య ఏమిటంటే మనుషులందరినీ కలపాల్సినటువంటి భాష... "లు" తగిలించుకుని ఇన్నిగా ఎందుకుండాలి?
* ప్రస్తుతానికి ఆగుదాం! అడపాదడపా మనం ఇలా కలుసుకుని మాటా మాటా అనుకుందాం! బావుంటుంది!!!