రామ్ పోతినేని 22వ సినిమాలో నాయికగా భాగ్యశ్రీ బోర్సే ఖరారు

డీవీ

బుధవారం, 20 నవంబరు 2024 (15:13 IST)
Bhagyashree Borse
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. 
 
#RAPO22 హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాతో గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది.
 
'మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు