బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం "భరత్". కత్రినా కైఫ్, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించగా, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు రూ.42.30 కోట్లు రాబట్టి.. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ సినిమాగా రికార్డుల్లోకెక్కింది. గతేడాది అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటించిన "థగ్స్ ఆఫ్ హిందూస్థాన్" చిత్రం దీపావళి కానుకగా విడుదలై తొలిరోజు రూ.48.27 కోట్లు వసూలు చేసింది.
ఇకపోతే, సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందాహై' చిత్రం తొలి రోజున రూ.34.10 కోట్లు వసూళ్లు రాబట్టగా, 'సుల్తాన్' రూ.36.54 కోట్లు వసూలు చేసింది. అలాగే, 2010లో విడుదలైన 'దబాంగ్' రూ.14.50 కోట్లు, 2011లో రిలీజైన 'బాడీగార్డు' రూ.21.60 కోట్లు, 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎట్' రూ.32.93 కోట్లు, 2014లో వచ్చిన 'కిక్' రూ26.40 కోట్లు, 2015లో రిలీజైన 'బజ్‌రంగ్ భాయ్‌జాన్' రూ.27.25 కోట్లు, 2016లో వచ్చిన 'సుల్తాన్' రూ.36.54 కోట్లు, 2017లో వచ్చిన 'ట్యూబ్‌లైట్' రూ.36.54 కోట్లు, 2018లో రిలీజైన 'రేస్-3' రూ.29.17 కోట్లు, ఇపుడు 'భరత్' రూ.42.30 కోట్లు చొప్పున వసూలు చేసింది.