Bheemla Nayak వాడు అరిస్తే భయపడతానా? పవన్‌పై రెచ్చిపోయిన రానా!

మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:13 IST)
Rana
భల్లాలదేవుడు రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఇప్పటికే విరాట పర్వం నుంచి ఓ సాంగ్ రిలీజైంది. తాజాగా భీమ్లా నాయక్ నుంచి రానా పాత్రకు సంబంధించిన వీడియోను వదిలారు. ఇందులో రానా క్యారెక్టరైజేషన్ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ‘వాడు అరిస్తే భయపడతానా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ ఐ.. సస్పెండెడ్’ అంటూ రానా రెచ్చిపోయాడు.
 
పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్‌లో రాబోతోన్న మలయాళీ రీమేక్ భీమ్లా నాయక్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. జనవరి 12న కచ్చితంగా థియేటర్లోకి వస్తామని పదే పదే మేకర్లు చెబుతూనే ఉన్నారు. 
 
అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి సినిమాలు బరిలోకి ఉన్నాయని, కాస్త సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకోమని భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. కానీ భీమ్లా నాయక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పేశారట. అయితే తాజాగా మరోసారి ఆ విషయాన్ని స్వాగ్ ఆఫ్ డానియల్ శేఖర్ రూపంలో చెప్పేశారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు