అగ్రహీరో మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం.
యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్ టీమ్ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.