భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తనకు భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల గౌరవం, ప్రేమ వుందన్నారు. మోదీతో గొప్ప సంబంధం వుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని ట్రంప్ కొనియాడారు.
ఇరు దేశాలు పోరాడుతున్నంత కాలం వారితో ఎటువంటి ట్రేడ్ డీల్స్ ఉండబోవని, వ్యాపారం చేయబోమని కరాఖండిగా చెప్పానని, ఆ తర్వాతే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాదు, కూడదు అంటే 250 శాతం టారిఫ్ విధిస్తానని భారత్, పాకిస్తాన్‌లను బెదిరించానని ట్రంప్ తేల్చి చెప్పారు.