అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ఒక్కొక్కటిగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భ్రమరాంబకు నచ్చేశాను అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు యువ సంగీత కెరటం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మంచి క్రేజున్న పాటల్ని ఇచ్చేశాడు. దేవి మార్క్ క్రేజీ మ్యూజిక్‌తో వచ్చిన ఈ సాంగ్ సాగర్ ఆలపించాడు.
ఈ పాటపై స్వయంగా నాగార్జున ట్వీట్ చేశారు. ఈ పాటకు థియేటర్‌లో స్టెప్పులేసేలా ఉందని ట్వీట్ చేయడం విశేషం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్నారు. మే 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా చైతుకి సూపర్ హిట్ ఇస్తుందని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.