బిగ్ బాస్ మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్న బిగ్ బాస్ మూడో సీజన్ షో డిజాస్టర్ దిశగా వెళ్తుందని రేటింగ్‌ను బట్టి చెప్తున్నాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంటే బిగ్‌బాస్ -3 చతికిలపడుతోంది.
తొలి రెండు సీజన్లతో పోలిస్తే బెటర్ రేటింగులు రాకపోవడతో ఏం చేయాలా? అని యోచిస్తున్నారు. అందుకే ఈ క్రమంలోనే ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. చివరకు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఊరించారు. ఓ హాట్ హీరోయిన్ అంటూ లీకులు ఇచ్చారు. శ్రద్ధాదాస్ వస్తుందనుకున్నారు. హెబ్బా పటేల్ పేరు గట్టిగా వినిపించింది. ఆఖరి నిమిషంలో ఈషా రెబ్బా అన్నారు.