బిగ్‌బాస్ హౌస్‌లో దెయ్యాల గోల.. జ్యోతక్కను వదలని హిమజ.. కెప్టెన్‌గా వితిక

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (18:17 IST)
బిగ్ బాస్‌హౌస్‌లో దెయ్యాల గోలను టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఆదేశించారు. మంగళవారం రాత్రి ఈ దెయ్యాల గోల కనిపించింది. లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా హౌస్ మేట్స్‌కి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. 

వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగుతెప్పించాలి. మనుషులకు విసుగు తెప్పించి.. వాళ్లను చంపాలి. దీనిలో భాగంగా తొలిరోజు ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది.
 
ఈ టాస్ లో చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు. దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయింది. ఆమెని నీటిలోకి తీసేసి చంపేశారు. ఐతే, ఈ గేమ్ విషయంలో పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అయింది. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్.
 
అంటూ తనకు వస్తోన్న బూతులు తిట్టింది. మీ ఆటను మీరే ఆడుకోండి. నేను ఈ గేమ్ ఆడను అంటూ బిగ్ బాస్ ని ఏకిపారేసింది. పునర్నవి బిగ్ బాస్ ఇంట్లో ఫైర్ అవ్వడం ఇది తొలిసారి ఏం కాదు. కానీ, ఏకంగా బిగ్ బాస్‌పై పున్ను ఫైర్ కావడం.. ఆపై బిగ్ బాస్‌కు క్షమాపణలు చెప్పడం జరిగిపోయింది. అయితే ఇదే టాస్క్‌కు సంబంధించి శివజ్యోతి, హిమజకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
శివజ్యోతిని హిమజ దెయ్యంగా తరుముకుంది. ఆ సమయంలో జ్యోతక్కా నిన్ను వదలను అంటూ వెంటబడింది. కానీ జ్యోతి మాత్రం శ్రీముఖితో తనకు ఆకలేస్తుందని.. తనకు రెండే రెండు బాగా నచ్చుతాయని ఫుడ్, లిప్‌స్టిక్ అంటూ హిమజను వెంటపడేలా చేసింది. టచప్ చేసుకోవాలని.. లిప్ స్టిక్ వేసుకోవాలని హిమజ పరిగెత్తేలా చేసింది. దీన్ని చూసిన హౌస్ మేట్స్ నవ్వుకున్నారు. ఈ ఫన్నీ టాస్క్ హౌస్ మేట్స్‌నే కాకుండా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
 
మరోవైపు ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ అయ్యేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. బరువు లెత్తగలవా జెండా పాతగలవా అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం తమకు ఇష్టమైన వాళ్ల గుర్రం ఎక్కి ట్రాక్ లో పరిగెత్తుతూ జెండాలు పాతాలి.
 
ఎవరు ఎక్కువ జెండాలు పాతితే వాళ్లే హౌస్ కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో పాల్గొనేందుకు ఇంత వరకు కెప్టెన్ కాని వాళ్ళు పాల్గొనాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో శ్రీముఖి, హిమజ, మహేష్ , వితికాలు కెప్టెన్ పోటీ బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు. ఎక్కువ ఓట్లు శ్రీముఖి, వితికా, మహేష్‌లకి పడడంతో ఈ ముగ్గరు కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్నారు. 
 
శివజ్యోతిని ఎత్తుకొని జెండాలు పాతగా, రవికృష్ణ వీపుపై శ్రీముఖి ఎక్కి జెండాలు పాతింది. ఇక వితికా తన భర్త వరుణ్ సందేశ్ వీపుపై ఎక్కి ఎక్కువ జెండాలు పాతింది ఎక్కువ జెండాలు పాతిన క్రమంలో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యే అవకాశాన్ని వితికా అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన భర్త వలన కలిగిన విజయాన్ని మరింతగా ఆస్వాదిస్తూ తెగ ముద్దులు పెట్టేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు