బిగ్ బాస్ మూడో సీజన్.. రాహుల్ ఈజ్ బ్యాక్.. పున్ను హ్యాపీ.. ప్రోమో అదుర్స్

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (17:25 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారాంతం బిగ్ బాస్ షోకు అతిథిగా వచ్చిన  వరుణ్‌తేజ్‌ హిమజ ఎలిమినేట్‌ అయినట్లుగా ప్రకటించాడు. వరుణ్‌తేజ్‌ హిమజ ఎలిమినేట్‌ అయినట్లుగా ప్రకటించాడు. ఇక రాహుల్‌ను సీక్రెట్‌ రూంలోకి పంపించి అతను లేకుండానే ఆదివారం ఎపిసోడ్‌ కంటిన్యూ చేశారు. 
 
దీంతో రాహుల్ లేకుండా బిగ్ బాస్ 3 చూసే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వెల్లువెత్తాయి. ఇంకా పునర్నవి కూడా రాహుల్ లేకపోవడంతో డీలా పడిపోయింది. వీరిద్దరి ప్రేమాయణం లేని బిగ్ బాస్ 3 ఏమాత్రం రంజుగా వుండదని భావించిన బిగ్ బాస్ చివరికి రాహుల్‌ని ఇంట్లోకి పంపించారు. దీంతో పున్ను ముఖంలో హ్యాపీ కనిపించింది. 
 
తొమ్మిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ అందర్నీ షాక్‌లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్‌ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. రాహుల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపారు. ఇక ఈ విషయం ఇంటిసభ్యులకు తప్ప అందరికీ తెలుసు. కానీ రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌ అని తెలియడంతో హౌజ్ మేట్స్‌తో పాటు అందరూ ఎగిరిగంతేస్తున్నారు.
 
అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నేటి ఎపిసోడ్‌లో రాహుల్‌ రీఎంట్రీతో ఇంటిసభ్యులకు షాక్‌ ఇచ్చాడు. రాహుల్‌ గొంతు వినగానే మొదట షాకైన పునర్నవి తర్వాత పట్టరాని సంతోషంతో గెంతులేసింది. రాహుల్‌ గ్రాండ్‌ ఎంట్రీతో ఇరగదీసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Devil is back Promo .....
#RahulSipligunj is back....Today promo
#BiggBossTelugu3 pic.twitter.com/IS5BS1XmeM

— Bagara annam (@BagaraRice) September 23, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు