షూటింగ్‌లో బిగుసుకున్న ఉరితాడు.. కట్ చెప్పని డైరక్టర్... కేకలు పెడుతుంటే కాపాడిన యూనిట్!

శనివారం, 19 నవంబరు 2016 (13:05 IST)
సాధారణంగా సినిమా షూటింగ్‌లో చిన్నపాటి అపశృతులు చోటుచేసుకోవడం సహజం. వీటిలో కొన్ని... అపశృతులు విషాదకరంగా ముగుస్తాయి కూడా. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ప్రిన్స్ నరుల అనే నటుడు బుల్లితెరపై నటుడిగా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ షో విన్నర్ కూడా. 
 
ఓ షో కోసం ప్రిన్స్ ఉరివేసుకుంటున్న దృశ్యం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకున్న ఉరి దాదాపు ఆయన ప్రాణాలను తీసినంత పని చేసింది. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో ప్రిన్స్ మెడకు ఉరి బిగుసుకుంది. డైరెక్టర్ కట్ చెప్పలేదు. 
 
అదేసమయంలో ఆ తాడు అతని మెడకు గట్టిగా బిగుసుకోవడంతో కేకలు పెడుతున్న ప్రిన్స్‌ను యూనిట్ సిబ్బంది పరుగున వెళ్లి కాపాడారు. మెడ చుట్టూ స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో చాలా భయపడ్డానని చెప్పాడు. ఈ సీన్ అభిమానులకు థ్రిల్ కలిగిస్తుందని అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి