కంగనా రనౌత్‌కు తేరుకోలేని షాకిచ్చిన బాంబే హైకోర్టు

సోమవారం, 13 డిశెంబరు 2021 (16:29 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌పై విచారణ కోసం ఈ నెల 22వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దుకు దేశంలోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ రైతులను ఆమె ఉగ్రవాదులతో పోల్చారు. దీంతో కంగనాపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఒక సిక్కు సంస్థ ఫిర్యాదు చేసింది. 
 
ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించి కోర్టు... ఈ నెల మొదట్లో దాఖలు చేశారు. అపుడు కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ వరకు కంగనాను అరెస్టు చేయబోమని పోలీసులు కోర్టుకు తెలిపారు. 
 
ఇపుడు ఈ సమయం సమీపిస్తుండటంతో ఈ నెల 22వ తేదీన విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. దీంతో ఆ రోజన కంగనా రనౌత్ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే, రైతులను తీవ్రవాదులతో పోల్చిన కంగనా.. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు