అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ని రివిల్ చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రలో చేరారు, నిజాయితీ, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించనున్నారు. చమత్కారం, వ్యంగ్యంతో కూడిన అతని పాత్ర యాక్షన్, ఎమోషన్, డ్రామాతో అలరించే కథనానికి డెప్త్ ని యాడ్ చేస్తుంది.