ఓటీటీలో బింబిసార.. రూ.15 కోట్లకు జీ-5 సొంతం

సోమవారం, 3 అక్టోబరు 2022 (12:38 IST)
బ్లాక్ బస్టర్ సినిమాలలో 'బింబిసార' ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై టాలీవుడ్‌లోనే సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 
అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను'జీ-5' సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాను ఈ నెల 7 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్గా నటించారు. 
 
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. అయితే ఈ సినిమాకు 15 కోట్ల వరకు థియేటర్‌కల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 40 కోట్ల షేర్ సాధించి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
 
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారా 2 స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు