ప్రముఖ చిత్రనిర్మాత, నటుడు రాజ్ కపూర్ కుమారుడు నటుడు, దర్శకుడు రాజీవ్ కపూర్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. దివంగత నటుడు రిషి కపూర్ భార్య నీతు కపూర్ ఈ వార్తలను ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. ఆమె తన బావమరిది చిత్రంతో పాటు RIP అని రాసారు. రాజీవ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా రాజ్ కపూర్ సంతానంలో రాజీవ్ కపూర్ ముగ్గురు సోదరులలో ఒకరు. ఈయనకు ఇద్దరు సోదరీమణులు వున్నారు. రాజీవ్ కపూర్ చిన్నవాడు - మిగిలినవారు రణధీర్ కపూర్, రిషి కపూర్, రితు నంద మరియు రిమా జైన్. ఆయన పెద్ద సోదరి రితు నంద, సోదరుడు రిషి కపూర్ గతేడాది జనవరి, ఏప్రిల్ నెలల్లో కన్నుమూశారు.