రణ్‌వీర్ సింగ్‌ నటనకు సమంత ఫిదా.. ఫ్యూచర్‌లో సినిమా చేస్తారట!

శుక్రవారం, 29 జులై 2022 (17:06 IST)
Samantha_Raveer
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో సమంత రూత్ ప్రభు పాల్గొంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో యాడ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఒక ప్రకటన కోసం ఆయనతో స్క్రీన్ పంచుకున్న తర్వాత రణవీర్ సింగ్ తనను ఆకట్టుకున్నారని సమంత తెలిపింది. 
 
నటి సమంత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ స్పందిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో ఆమెతో పూర్తి స్థాయి సినిమా చేయాలని కూడా ఆకాంక్షించారు. 
 
సమంతపై రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇకపోతే.. ఇటీవల, రణవీర్ సింగ్ తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలు ఆయనను వివాదంలోకి నెట్టాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు