రష్మిక-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా?

గురువారం, 28 జులై 2022 (20:06 IST)
ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ద్వారా సమంతకు కూడా బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ నుంచి సమంతకు ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్ల విషయంలో సమంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 
 
అయితే సమంత బాలీవుడ్ ఆఫర్ల విషయంలో ఈ విధంగా చేయడానికి రష్మిక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాతో రష్మిక బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో రష్మిక బిజీగా ఉన్నారు. 
 
అయితే రష్మిక దూకుడుకు సమంత బ్రేకులు వేయాలని భావిస్తున్నారని సమాచారం. సమంత ఒకే సమయంలో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. 
 
ఈ విధంగా చేయడం ద్వారా రష్మికకు షాకివ్వాలని సమంత భావిస్తున్నారని బోగట్టా. రష్మిక సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు