అతిలోక సుందరి అంటే అభిమానం లేనిది ఎవరికి. అందరికీ శ్రీదేవి అంటే అభిమానమే. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా ఎంతోమంది సినీ ప్రముఖుల అభిమానం సొంతం చేసుకుంది. ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో... ఆమెతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
నిర్మాత కరణ్ జోహార్... శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. అప్పుడు చిత్రీకరించిన వీడియోను శిల్పాశెట్టి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు. శ్రీదేవి నటించిన మామ్ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు కోరారు.