ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తనకు కరోనా సోకిందంటూ తన ఇన్ స్టాగ్రాంలో వెల్లడించింది. ఈమధ్య షో ముగిశాక తనకు అస్వస్థతగా వుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాననీ, అందులో తను కరోనా పాజిటివ్ వున్నట్లు తేలిందని చెప్పింది. ప్రస్తుతం తను హోమ్ క్వారెంటైన్లో వున్నాననీ, తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని చెప్పింది. తనతో ఇటీవల కలిసి వున్నవారంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.