ఆ మందులు వాడిన ఐదురోజులకే సుశాంత్ మరణించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రియాంక సింగ్‌ను, ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ తరుణ్ కుమార్‌ను ప్రశ్నిస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది.
మరోవైపు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో వరుసగా రెండోరోజైన సోమవారం కూడా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులు విచారించారు. ఈ డ్రగ్స్ రాకెట్‌లో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శామ్యూల్ మిరండా, సుశాంత్ ఇంటి పనిమనిషి దిపేశ్ సావంత్‌ల పాత్ర గురించి తెలుసుకునేందుకు రియాను ప్రశ్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.