బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రిలీజైంది. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సాంగ్ టీజర్ ఆదివారం (మే 1)న రిలీజైంది. ఆ పాటలో మహేష్ బాబు వైట్ కోట్‌లో అలరించాడు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కూడా తన ఫస్ట్ లుక్‌లో వైట్ ప్యాంట్‌తో కారు వెనుక భాగంలో పరుపుపై పడుకున్నట్లుండగా మహేష్ బాబు కుర్చీపై దర్జాగా కూర్చున్నట్లు గల ఫోటో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంది.
కాగా శ్రీమంతుడు సినిమాకు తర్వాత రిలీజయ్యే బ్రహ్మోత్సవం సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సమంత, కాజల్, ప్రణీతలు కథానాయికలుగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు మహేశ్‌బాబు, ప్రసాద్ వి. పొట్లూరి చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 7వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాదులో అట్టహాసంగా జరుగనుంది.