మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వివాహ రిసెప్షన్ సందర్భంగా నవ వధువును అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి వధువు సప్నా సోలంకి, ఆమె భర్త ఆశిష్ రాజక్ రిసెప్షన్ వేదికకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. వెంటనే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వేగంగా స్విఫ్ట్ కారులో వచ్చి, రిసెప్షన్ వేదికపై గల వధువును ఎత్తుకెళ్లారు. వరుడితో పాటు అక్కడున్న వారిని బెదిరించి ఆమెను కిడ్నాప్ చేశారు.
సప్నా ఈ విషయం తనకు చెప్పిందని ఆశిష్ ఆరోపించాడు. సప్నా కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో వారిని సంప్రదించలేకపోవడంతో, వారు కూడా రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. కిడ్నాపర్ల గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు.