వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే "బ్రాందీ డైరీస్". గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్, మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం "బ్రాందీ డైరీస్". ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.