అయితే గత రెండురోజులుగా ఎటువంటి అప్‌డేట్ సాయితేజ్ గురించి తెలియకపోవడంతో అంతా గందరగోళంలో వున్నారు. శుక్రవారంనాడు బన్నీ అపోలోకి వెళ్ళి సాయితేజ్ వార్డ్‌కు వెళ్ళి బయటనుంచే చూసి వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం ఏమీలేదని వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్లను ఆసుపత్రికి ఏదశలో వచ్చారో ఎటువంటి దెబ్బలు తగిలియానో పూర్తి ఆరా తీశారు. మీరు చేయాల్సింది చేస్తున్నారు. అంతా భగవంతుని ఆశీర్వాదం అంటూ అనడం అక్కడివారిని కలచివేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.