అశోక వనంలో అర్జున కళ్యాణం-నడిరోడ్డుపై విశ్వక్ సేన్ ఫ్రాంక్ (video)

సోమవారం, 2 మే 2022 (13:13 IST)
అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో యువ హీరో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మే 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ప్రమోషన్స్‌లో భాగంగా నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు విశ్వక్సేన్.
 
సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఐమాక్స్ థియేటర్ వద్ద రివ్యూలు అంటూ మైక్ కనపడితే ఓవర్ యాక్టింగ్ చేసే ఓ యువకుడిని సినిమా ప్రమోషన్ కోసం తీసుకొచ్చారు. విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళుతుంటే ఆ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని నడిరోడ్డుపై న్యూసెన్స్ చేశాడు. 
 
విశ్వక్ కారులోంచి వచ్చి అడిగితే అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌ సేన్‌ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్‌. నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా అంటూ హల్ చల్ చేశాడు. 
 
విశ్వక్‌సేన్‌ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు అక్కడ డ్రామా నడిపించాడు. దీంతో కాసేపు నడిరోడ్డు మీద వీరిద్దరూ కలిసి హంగామా చేసి అక్కడి జనాలకి ఇబ్బంది కలిగించారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ప్రమోట్ చేయగా ఇది చూసిన వాళ్లంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంత నీచంగా చేయాలా? అంటూ ఫైర్ అవుతున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు