Katate Raju, Viswak, Bekkem
తొలి చిత్రం `ఈ నగరానికి ఏమైంది`లోనే తన మార్క్‌ను క్రియేట్ చేసిన నటుడు విశ్వక్ సేన్. యంగ్ ఏజ్‌లోనే నిర్మాతగానూ, దర్శకుడిగానూ మల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పుట్టినరోజు వేడుక మంగళవారం రాత్రి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకకు విశ్వక్ సేన్ తో చిత్రాలు తీస్తున్న రచయితలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌పై విడుదల చేసిన స్పెషల్ పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ రెండు కొత్త చిత్రాలను వెల్లడించారు. ఇప్పటికే `ముఖ చిత్రం`లో పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. యువి.క్రియేషన్స్‌లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ, లేడీస్ నైట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా ఫలక్ నామా దాస్ 2`, `స్టూడెంట్ జిందాబాద్` అనే రెండు నూతన చిత్రాలను విశ్వక్ ప్రకటించారు.