ఆ నటుడు నాలో సగం వుండడు, నన్ను గదిలోకి లాక్కెళ్లి: నటి సంచలన ఆరోపణలు

సోమవారం, 3 మే 2021 (16:47 IST)
సినీ ఇండస్ట్రీ చిత్రంలో కాస్టింగ్ కౌచ్ సాధారణం. శ్రీరెడ్డి, ఐశ్వర్య రాజేష్, పార్వతి, వరలక్ష్మి.. తాజాగా దంగల్ బ్యూటీ ఫాతిమా... సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు వున్నాయని చెప్పారు. ఇదిలావుంటే మరో సీనియర్ నటి పద్మ జయంతి మరో కామెడీ నటుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.
 
సుమారు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మా జయంతి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె మాట్లాడుతూ... దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణపై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నేను సెట్లో కూర్చున్నాను. ఎవరో వెనుక నుండి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఎవరా అని చూస్తే హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ.
 
నా చేయి గట్టిగా పట్టుకుని నన్ను ఒక గదిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. నేను ఏంటి చేయి వదలండి అంటే... నీతో పని వుంది రా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ఆయన మద్యం సేవించి వున్నట్లు అర్థమైంది. ఇంతలో అసభ్యమైన పదజాలం వాడారు. వెంటనే నేను గట్టిగా చేయి విదిల్చుకుని ఆయన పీక పట్టుకున్నాను. ఆయన చూస్తే నాలో సగం వుండడు. నన్ను గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసాడు.
 
నేను గట్టిగా పట్టుకోగానే కేకలు వేశాడు. వెంటనే సెట్లో వున్నవారు వచ్చి సర్ది చెప్పారు. తర్వాత పెద్దలు కలగజేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లే ఇలా రచ్చ చేస్తే ఆఫర్లు రావని బెదిరించారు కూడా. ఆ తర్వాత కూడా నాకు ఛాన్సులు రాకుండా చేసారు. ఇప్పుడు అంతా మర్చిపోయారు. నేను మాత్రం నా సినిమాల్లో నటించుకుంటూ వెళ్తున్నాను'' అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు